చిత్తూరు జిల్లా శెట్టిపల్లి పంచాయితీలోని రైల్వే గ్యారేజీ వెనుక మహిళ (40) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంట పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకుని గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకొంది. అలిపిరి పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు, మహిళ వివరాలు తెలుసుకొనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
ఇది చదవండి నడిసంద్రపు నౌకల్లో అంతర్జాలం.. పల్లెటూరి యువకుడి ప్రతిభతో సాధ్యం