చిత్తూరు జిల్లాలోని మహిళ సజీవ దహనం స్థానికంగా కలకలం రేపుతోంది. బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ తరిగోడులో మహిళ సజీవ దహనమైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... గుర్తుతెలియని దుండగులు ఆమెపై పెట్రోలు పోసి చంపేసినట్టు చేసినట్లు తెలిపారు. తరిగోడు సమీపంలోని చెరువులో డ్రిప్ పైపులు మెడకు చుట్టి ఈడ్చుకెళ్లి పెట్రోలు పోసి తగలబెట్టి... దుండగులు పారిపోయారని గుర్తించారు. బి.కొత్తకోట సీఐ అశోక కుమార్ గ్రామస్తులందరినీ విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: