ETV Bharat / state

TAMILANADU WOMAN SARPANCH ARRESTED IN CHITTOOR DISTRICT : తమిళనాడు మహిళా సర్పంచ్ అరెస్టు.. దందా మామూలుగా లేదుగా!

భూమి తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తామని.. అమాయకులను నమ్మించి మోసం చేసిన కేసులో ముఠా నాయకురాలు ఉమామహేశ్వరి అలియాస్‌ షాలిని(47)ని చిత్తూరు జిల్లా యాదమరి పోలీసులు శనివారం అరెస్టు(tamilanadu woman sarpanch arrested in Chittoor district) చేశారు. అనంతరం నిందితురాలిని అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు.

తమిళనాడు మహిళా సర్పంచ్ అరెస్టు..
తమిళనాడు మహిళా సర్పంచ్ అరెస్టు..
author img

By

Published : Nov 28, 2021, 4:18 PM IST

Updated : Nov 28, 2021, 5:11 PM IST

తమిళనాడులోని అరక్కోణం బంగారమ్మన్‌ కండిగైకు చెందిన జె.ఉమామహేశ్వరి అలియాస్‌ షాలిని.. కైనూర్‌ పంచాయతీ సర్పంచిగా ఉంటూ రవిశంకర్‌ అలియాస్‌ రమేష్‌ ప్రభాకర్‌, రాజేష్‌ అలియాస్‌ విజయ్‌, నరేష్‌ అలియాస్‌ కార్తీక్‌, శ్రీకాంత్‌, శ్రీనివాసన్‌, అయ్యప్పన్‌, రామరాజ్‌, దినకరన్‌, సయ్యద్‌ అలీతో ఒక ముఠా ఏర్పాటు చేసింది.

అమాయకులను నమ్మించి భూమి తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పుగా ఇస్తామని ఈ ముఠా సభ్యులు నమ్మిస్తారు. ఒప్పందం కుదిరాక భూమి రిజిస్ట్రేషన్‌, స్టాంపు రుసుం చెల్లించడానికి ముందుగా కొంత నగదు ఇవ్వాలని చెబుతారు. తమకు అవసరానికి డబ్బు అందుతుందని నమ్మి, వారు అడిగిన నగదు ఇచ్చే సమయానికే సరిగ్గా పోలీసు దుస్తుల్లో ఉన్న కొందరు నకిలీ పోలీసులు.. వాహనంలో అక్కడికొచ్చి, వారిని బెదిరించి నగదు అపహరిస్తారు.

ఇలా రూ.10లక్షలు మోసం చేసి ముద్దాయిలు పారిపోయారని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పాలంపల్లికి చెందిన సూర్యనారాయణ.. చిత్తూరు జిల్లా యాదమరి పోలీస్​స్టేషన్‌లో(case file in Yadamari police station) గతంలో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన యాదమరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాలింపు చేపట్టి.. ముఠా సభ్యులను ఈ ఏడాది జులై 17న అరెస్టు చేశారు. అయితే.. నాయకురాలు షాలిని అప్పట్నుంచి పరారీలో ఉంది. ఎట్టకేలకు శనివారం తమిళనాడులో ఉమామహేశ్వరిని(షాలిని) అరెస్టు చేసి, రిమాండుకు తరలించామని ఎస్సై చెప్పారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 28, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.