చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద గల హెరిటేజ్ కర్మాగారంలో జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ జీఎం వంశీథర్ ఆధ్వర్యంలో అమ్మోనియం లీకేజీ - ఎమర్జెన్సీ రెస్పాన్స్‌పై అవగాహన శిబిరం నిర్వహించారు. డిప్యూటీ చీఫ్, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మోనియం వినియోగం డైరీలో ఒక భాగం అని శివకుమార్ రెడ్డి తెలిపారు.
హెరిటేజ్‌లో మాక్ డ్రిల్...
అమ్మోనియం లీకేజీపై ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు... ఇంకా ఎలాంటి అంశాలపై మెరుగైన ఫలితాలు రాబట్టాలనే అంశాలను వివరించారు. హెరిటేజ్ వంటి పెద్ద కంపెనీలో మాక్ డ్రిల్ నిర్వహించి ఉద్యోగులకు అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో 216 ఫ్యాక్టరీలు ఉన్నాయని... ముఖ్యంగా డైరీ రంగంలోని కర్మాగారాల్లో కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వినియోగం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అలాంటి వాటిపై దృష్టి సారించి భద్రతా ప్రమాణాలను పెంపొందిచాలని సూచించారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అమ్మోనియం లీకేజ్‌పై అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.