ETV Bharat / state

వేధిస్తున్నారంటూ ఎమ్మార్వోపై వీఆర్వోల ఫిర్యాదు

తమను మానసికంగా హింసిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం తహసీల్దార్ మహేశ్వరి బాయిపై వీఆర్వోలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో షంషేర్​కు ఫిర్యాదు లేఖను అందజేశారు. తహసీల్ధార్​పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

author img

By

Published : Sep 28, 2020, 2:10 PM IST

VROs complain on MRO
ఎమ్మార్వోపై వీఆర్వోలు ఫిర్యాదు
ఎమ్మార్వోపై వీఆర్వోలు ఫిర్యాదు
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం తహసీల్దార్ మహేశ్వరి బాయి తమను మానసికంగా వేధిస్తున్నారంటూ... వీఆర్వోలు ఆందోళన బాట పట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న తొమ్మిది మంది వీఆర్వోలు... మహేశ్వరి బాయి తీరును నిరసిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో షంషేర్ కు ఫిర్యాదు లేఖను అందజేశారు. తామంతా సామూహిక సెలవుపై వెళ్లిపోతున్నట్లు తెలియజేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ముగ్గురు మహిళా వీఆర్వోలు, ఉన్నతాధికారుల వద్ద తమ ఆవేదనను చెప్పుకొని కంటతడి పెట్టుకున్నారు. తహసీల్దార్ స్థాయిలో ఉండి తమను మానసికంగా వేధిస్తుండటంతో చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఇవీ చూడండి..

6 నెలల్లో అలిపిరి కాలినడక మార్గం పనులు పూర్తి: తితిదే ఛైర్మన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.