రెండో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం కోళ్లబైలు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కోళ్లబైలులో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రెండో దశ పోలింగ్ జరిగింది. ఓటింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్ బాక్సులను 2కిలోమీటర్ల దూరంలోని బైరెడ్డి కాలనీకి తరలించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. దీన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు.
సిగ్నల్స్, నెట్ వర్క్ సమస్య కారణంగానే లెక్కింపు కేంద్రం మార్చాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అయితే.... బ్యాలెట్ పేపర్ కౌంటింగ్‌కు ఇంటర్ నెట్ ఎందుకంటూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామంలోనే కౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు.. గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి: లోకల్ రిజల్ట్: వెలువడుతున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు