ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ సమీప ప్రాంతం మూలపల్లి వాగుపైన కల్వర్టు వంతెన కొట్టుకుపోవడంతో... గ్రామస్థులే తాత్కాలికంగా నిర్మించుకున్నారు. సుమారు 10 రోజులుగా రాకపోకలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే మహిళలకు, చిన్న పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే... ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో.... గ్రామస్థులే కర్రలతో తాత్కాలికంగా వంతెన నిర్మించుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: