తిరుపతి అర్బన్ నూతన ఎస్పీగా వెంకట అప్పలనాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పని చేస్తున్న ఆయనను తిరుపతి అర్బన్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న రమేష్ రెడ్డిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం తొలిగించిన సంగతి తెలిసిందే. తిరుపతి అర్బన్ ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్తూరు ఎస్పీ సెంథిల్కుమార్ను రిలీవ్ చేశారు.
ఇదీచదవండి