ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలకు మాత్రం అన్నం పెట్టే నాధుడే కరువయ్యాడు ఈ రోజుల్లో. అయితే ..చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిథిలోని రైతులను ఆదుకోవడానికి అమెరికాలోని తెలుగు వారు సంకల్పించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి.. సతీష్‌రెడ్డి, దేవరఇంటి రామకృష్ణారెడ్డి, రవి శంకర్ రెడ్డి ద్వారా కొనుగోలు చేస్తున్నారు.
సుమారు 40 టన్నుల టమోటా, 13 టన్నుల ఎర్రగడ్డలు, రెండు టన్నులు క్యాబేజీ, 3 టన్నులు వంకాయలు, 5 టన్నుల క్యారెట్ లను కొనుగోలు చేయించి, స్థానిక పేద ప్రజకు ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కరోనా కాలంలో రైతన్నలు నష్టపోకుండా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి: