ETV Bharat / state

కేంద్రం పంపిస్తున్న టీకాలు అదేరోజు ప్రజలకు అందిస్తున్నాం: ఆళ్ల నాని

కేంద్రం 500 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఇస్తోందని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కేంద్రం పంపిస్తున్న టీకాలు అదే రోజు ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. చిత్తూరు జిల్లాలో కొవిడ్ పరిస్థితిపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Alla Nani
Alla Nani
author img

By

Published : May 8, 2021, 4:40 PM IST

చిత్తూరు జిల్లాలో కొవిడ్ పరిస్థితిపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఉన్నతాధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమీక్షలో పాల్గొని ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లభ్యతపై చర్చించారు.

కేంద్రం 500 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఇస్తోందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆక్సిజన్ కొరత, పడకల కొరత రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. కొవిడ్ కేంద్రాలు పెంచితే ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్న ఆళ్ల నాని... ప్రతి నియోజకవర్గంలో కొవిడ్ కేంద్రం ఏర్పాటుకు యోచిస్తున్నట్టు వెల్లడించారు.

కేంద్రం పంపిస్తున్న టీకాలు అదే రోజు ప్రజలకు అందిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్సిజన్ అందుబాటులో లేకనే ఆసుపత్రులకు వస్తున్నారన్న ఆళ్ల నాని... త్వరలోనే కొవిడ్‌ కేంద్రాల్లో ఆక్సిజన్‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

రెండో డోస్: వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.