చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలం ఎలుగుబండ వద్ద.. గుర్తు తెలియని మహిళ శవం కలకలం సృష్టించింది. 30 ఏళ్ళు పైబడిన వివాహితను.. సుమారు 20 నుంచి 30 రోజుల క్రితం తలపై బండరాయితో కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. చంపిన అనంతరం రెండు కొండల మధ్య వేసి కాల్చి వేశారని వెల్లడించారు. దుర్వాసనను గొర్రెలకాపరులు గుర్తించి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి, వాల్మీకిపురం సీఐ నాగార్జున రెడ్డి, కలికిరి కె.విపల్లి మండలాల ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని.. కాలిపోయిన మృతదేహాన్ని వెలికి తీయించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. సగం కాలిపోయిన చీర, మంగళసూత్రం ఘటనా స్థలంలో లభించాయి. 30 ఏళ్లు దాటిన వివాహిత ఎవరైనా తప్పిపోతే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: