ETV Bharat / state

ఈతరాక ఒకరు, కాపాడబోయి మరొకరు.. చెరువులో మునిగి మృతి

సరదాగా చేపలు వేటకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందారు. ఈతరాక ఒకరు, కాపాడేందుకు యత్నించి మరొకరు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మాధవరంలోని తామన్న చెరువులో జరిగింది.

Two persons died due to felt into a pond at madhavaram
చెరువులో మునిగి ఇద్దరు మృతి
author img

By

Published : Jun 23, 2021, 11:27 AM IST

ఈతరాక ఒకరు, కాపాడేందుకు యత్నించి మరొకరు ప్రాణాలు విడిచారు.. సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం మాధవరం ఎస్సీ కాలనీకి చెందిన పట్టాభి, సుధాకర్​, మరికొంతమంది.. తామన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే కంటిచూపు సరిగాలేని పట్టాభి.. అదుపుతప్పి చెరువులో పడ్డాడు. పట్టాభిని రక్షించేందుకు సుధాకర్(36) చెరువులో దూకాడు. ఈ క్రమంలో పట్టాభి సుధాకర్‌ను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటి మునిగి బురదలో కూరుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.

అక్కడే ఉన్న సుధాకర్​ కుమారుడు ధనుశ్ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇద్దరిని వెలికి తీశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్​కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి.. దంతెరపల్లి హత్యకేసులో నిందితుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.