ETV Bharat / state

భాకరాపేట కనుమలో ఘోర రోడ్డు ప్రమాదం... తల్లీబిడ్డ మృతి - chittor crime news

స్కూటీని ట్రాక్టర్​ ఢీకొన్న ఘటనలో తల్లీబిడ్డ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమలో జరిగింది.

two-persons-died-and-one-person-injured-in-road-accident-at-bhakarapeta-chittoor-district
భాకరాపేట కనుమలో ఘోర రోడ్డు ప్రమాదం... తల్లీబిడ్డ మృతి
author img

By

Published : Sep 25, 2020, 4:14 PM IST

చిత్తూరు జిల్లా యాదమరి మండలం గొల్లపల్లికి చెందిన దంపతలు దేవేంద్ర కుమార్, జమున. వీరు బతుకుదెరువు కోసం చిన్నగొట్టికల్లు మండలం యడంవారిపల్లిలో నివాసముంటున్నారు. జమున ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై చంద్రగిరి మండలం, కొంగరవారిపల్లిలోని తల్లిదండ్రులు వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరి ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్​ ముందు భాగం విడిపోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జమున, కొడుకు దీపక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.... కుమార్తె మీనాక్షి తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానకి చేరుకున్న పోలీసులు.. మీనాక్షిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై రవి నాయక్ వెల్లడించారు.

ఇదీ చూడండి: దుర్భర దారిద్ర్యంలో జీవనం.. అయినా గుర్తింపు దొరకని దైన్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.