ETV Bharat / state

స్థిరాస్తి వ్యాపారానికి... 'తుడా' శ్రీకారం - sale

ఆదాయాన్ని పెంచుకునే దిశగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ పరిధిలోని ఖాళీ స్థలాల ద్వారా స్థిరాస్థి వ్యాపారానికి శ్రీకారం చుడుతోంది. ఖాళీ స్థలాల్లో ఆకర్షణీయ లేఔట్లు రూపొందించి వాటిని విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకొనే దిశగా సమాయత్తమవుతోంది.

తుడా
author img

By

Published : Jul 6, 2019, 12:05 PM IST

స్థిరాస్తి వ్యాపారానికి... 'తుడా' శ్రీకారం

ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు సంపాదించటంతో పాటు... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అత్యుత్తమ పది నగరాల్లో ఒకటిగా నిలిచిన తిరుపతి నగరపాలక సంస్థ(తుడా) ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశలో చర్యలు చేపట్టింది. తిరుపతితో పాటు శివారు ప్రాంతాలతో కలిపి ఏర్పాటు చేసిన తుడా... అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానికి అవసరమైన నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆమోదించిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌)ను అమలు చేసే దిశగా రహదారులను అభివృద్ధి చేయనున్నారు. పార్కులు, ఆటస్థలాలు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు.

ఖాళీ స్థలాలు విక్రయం
ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు గతంలో తుడా వేసిన లే అవుట్లలోని ఖాళీ స్థలాలను వేలం వేయాలని నిర్ణయించారు. తుడా నేతృత్వంలో మంగళం, కరకంబాడి వంటి వివిధ ప్రాంతాల్లో లే-అవుట్లు వేసి ప్లాట్లను విక్రయించగా కొన్ని మిగిలిపోయాయి. వీటిల్లో తుడా తరఫున ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు వీల్లేనందున... అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.

తమ పరిధిలో సుమారు 80 ఖాళీ స్థలాలు విక్రయించేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించిన తుడా అధికారులు...బహిరంగ వేలం వేయడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. తుడా అధీనంలోని రేణిగుంట మండలంలో ఉన్న దాదాపు 45 ఎకరాలను లే-అవుట్‌ వేసి.. ప్లాట్లుగా విభజించనున్నారు. తర్వాత వీటిని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.

Intro:ap_tpg_81_5_aasaalakuvetanalu_ab_c14

Body:ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఆశ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తుంది ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లాలో 3,414 మందికి ప్రయోజనం కలగనుంది గ్రామీణ ప్రాంతాల్లో లో వైద్య సేవలు విస్తరణలో భాగంగా 2006లో ఆశీర్వచనం ప్రవేశపెట్టారు పనితీరును బట్టి పారితోషకం ఇచ్చేలా వీరిని నియమించారు దీనిని బట్టి ఇ వారికి నెలకు సుమారు రెండు వేల రూపాయలు పారితోషికం అందుకున్న వారు 2018 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశల గౌరవ వేతనాన్ని మూడు వేలకు పెంచడంతోపాటు పనితీరు ఆధారంగా మరో 5500 వరకు అందేలా చూస్తామని తెలిపారు ఆ విధంగా 2018 డిసెంబర్ వరకు గౌరవంతోపాటు సక్రమంగానే ఉంది 2019 జనవరి నుంచి పెంచిన వేతనాలతోపాటు పారిస్ కు అందని పరిస్థితి నెలకొంది దీనితో ఆశా కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి కోరికను నెరవేర్చుకోవాలని భావించారు అయితే వారు ఆందోళన బాట పట్టక ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇ వారి వేతనాన్ని 10000 చేస్తున్నట్లు ప్రకటించడం తో ఆశా కార్యకర్తలు సంతోషం వెల్లివిరుస్తుంది ఊహించని విధంగా వేతనాలు పెంచడం పై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు చిత్తశుద్ధితో పని చేయడం ద్వారా ముఖ్యమంత్రి తీసుకుంటామంటూ పలువురు తెలిపారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.