మిగిలిన భూములను రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకొని తుడాకు అప్పగించనుంది. ఆ భూముల్లో టౌన్ షిప్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మరో వైపు తుడా పరిధిలోని ఆరు మండలాలతోపాటు తిరుపతి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన తుడా సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తితిదే నిర్వహణలో ఉన్న బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల్లో పచ్చదనం కోసం చర్యలు తీసుకుంటున్నారు. రోగుల సహాయకులు వేచి ఉండేందుకు షెడ్‌లు నిర్మించాలనే ఆలోచన చేస్తున్నారు. తుడా పరిధిలోని 6 మండలాల తహసీల్దారు, మండల అభివృద్ధి కార్యాలయాల వద్ద పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు వేచి ఉండేందుకు షెడ్లు నిర్మించనున్నారు.
ఆక్రమణలకు గురవుతున్న కోట్ల రూపాయల విలువ చేసే తుడా ఖాళీ భూములను గుర్తించి... బహిరంగ వేలం ద్వారా తుడా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహించడానికి పండ్ల మొక్కలతోపాటు... ఎర్రచందనం మొక్కలు పంపిణీ చేయనుంది.