ETV Bharat / state

పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీకి తితిదే చర్యలు

author img

By

Published : Jan 11, 2021, 9:29 PM IST

దేశీయ గోవుల ద్వారా సేక‌రించే పంచ‌ గ‌వ్యాల‌తో ప‌లు ఉత్ప‌త్తులను తయారు చేయ‌డంపై దృష్టి సారించాల‌ని తితిదే సిబ్బందికి ఈవో జవహర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఎస్వీ గోశాల‌, ఆయుర్వేద ఫార్మ‌శీ అధికారుల‌తో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు.

ttd eo review over panchagvyalu in tirupati
పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీకి తితిదే చర్యలు

తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఎస్వీ గోశాల‌, ఆయుర్వేద ఫార్మ‌శీ అధికారుల‌తో తితిదే ఈవో జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోసంత‌తి అభివృద్ధి కోసం గుజ‌రాత్‌కు చెందిన శ్రీ గోపాల్ భాయ్ సుతారియ‌ నిర్వహణలోని 'బ‌న్సి గిర్‌ గోశాల‌'లో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను.. తితిదే గోశాల‌లో అమ‌లు చేయాలని ఆదేశించారు. దేశీయ గోవుల ద్వారా సేక‌రించే పంచ‌గ‌వ్యాల‌తో ప‌లు ఉత్ప‌త్తులను తయారు చేయ‌డంపై దృష్టి సారించాల‌ని సూచించారు. వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో వాడేందుకు వీలుగా ఉన్న‌ 'గోకృపామృతం మోడ‌ల్‌'ను వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం శాస్త్రవేత్త‌ల‌ దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. పంచ‌గ‌వ్యాల‌తో త‌యారు చేసే ధూపం, స‌బ్బులు, అగ‌ర‌బ‌త్తీలు, ప‌రిశుభ్ర‌తా సామ‌గ్రి లాంటి ఉత్ప‌త్తులను.. తితిదే గోశాల‌లో త‌యారు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్వీ గోశాల‌, ఆయుర్వేద ఫార్మశీ అధికారుల‌ను ఆదేశించారు. అనంతరం పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ, ఉప‌యోగాలు, మార్కెటింగ్ తదితర అంశాల‌పై శ్రీ గోపాల్ భాయ్ సుతారియ ప్రతినిధులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీపై తితిదేకు శిక్ష‌ణ ఇవ్వాలని ఈవో వారిని కోరారు.

ఇదీ చదవండి: తిరుపతిలో నిషేధిత భూముల జాబితా నుంచి సర్వే నంబర్ల తొలగింపు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.