తితిదే ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే లెప్రసీ ఆసుపత్రి, వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రి, వృద్ధాశ్రమాలల్లో సమస్యలను గుర్తించిన ఛైర్మన్.. తక్షణమే వాటికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు, అన్నమయ్య మార్గాలలో ప్రాథమిక చికిత్స సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అన్నారు. అన్నమయ్య కాలినడక మార్గంలో నూతన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీచదవండి.