ETV Bharat / state

'తితిదే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వచ్చేలా చూడండి' - TTD CHAIRMEN MEET WITH SBI CHAIRMEN IN TIRUPATH

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేష్ కుమార్​కి తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వైవీ సుబ్బారెడ్డి తితిదే డిపాజిట్లపై ఎక్కువ వడ్డి వచ్చేలా ఏర్పాటు చేయాలని దినేష్ కుమార్​ని కోరారు. ఈ ప్రతిపాదన వీలైనంత త్వరగా ఆచరణలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు తెలిపారు.

ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్​తో తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

author img

By

Published : Nov 29, 2020, 11:15 PM IST

తితిదే డిపాజిట్ల‌పై ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చేలా ఏర్పాటు చేయాల‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్ దినేష్ కుమార్ ఖారాను తితిదే ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి కోరారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమలకు వచ్చిన ఎస్బీఐ ఛైర్మన్​కు వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కొవిడ్‌-19 నేప‌థ్యంలో బ్యాంకులు డిపాజిట్ల‌పై వ‌డ్డీని త‌గ్గించ‌డంతో తితిదే డిపాజిట్ల మీద ప్ర‌భావం ప‌డింద‌ని వివరించారు. ప్ర‌స్తుతం బ్యాంకులు సాధార‌ణ ప‌రిస్థితుల‌కు చేరుకుంటున్నందు వ‌ల్ల వ‌డ్డీ విష‌యంలో తితిదేను ప్ర‌త్యేకంగా ప‌రిగ‌ణించి డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ వ‌చ్చేలా చూడాల‌ని కోరారు. ధార్మిక కార్య‌క్ర‌మాల‌తోపాటు సామాజిక కార్య‌క్ర‌మాలు పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నందు వ‌ల్ల ఈ ప్ర‌తిపాద‌న వీలైనంత త్వ‌ర‌గా ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుబ్బారెడ్డి ఎస్బీఐ ఛైర్మ‌న్‌ను కోరారు.

ఇవీ చదవండి

చెరువులో మునిగి.. ముగ్గురు పిల్లలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.