ETV Bharat / state

TIRUMALA: తిరుమల ఘాట్‌ రోడ్లలో.. భక్తులకు అనుమతి - తిరుమల తాజా వార్తలు

ఈరోజు ఉదయం 6 గంటల నుంచి తిరుమల ఘాట్ రోడ్లలో భక్తులకు అనుమతి కల్పిస్తున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా నిన్న రాత్రి 8 గంటల నుంచి రెండు కనుమదారులను మూసివేశారు.

ttd allowing devotees on the roads of Thirumala Ghat
తిరుమల ఘాట్‌ రోడ్లలో భక్తులకు అనుమతి
author img

By

Published : Nov 12, 2021, 9:47 AM IST

తిరుమల ఘాట్‌ రోడ్లలో తితిదే భక్తులను అనుమతిస్తోంది. వర్షం తగ్గడంతో ఉదయం 6 నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. భారీ వర్షం కారణంగా నిన్న రాత్రి 8 గంటలకు 2 కనుమదారులు మూసివేశారు. మెట్ల మార్గంలో భారీగా వరద నీరు చేరడంతో జలపాతాన్ని తలపించింది. అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన బురద నీటితో మెట్లపై మట్టి పేరుకుపోయింది.

దీంతో.. ఈ మార్గాన్ని మూసివేసి భక్తుల రాకపోకలను నిలిపివేశారు. పేరుకుపోయిన బురదను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. నడిచి కొండపైకి వెళ్లాలనే భక్తులను శ్రీవారి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తున్నారు. జలపాతాన్ని తలపించేలా ప్రవహించిన వరదనీటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇదీ చూడండి: WEATHER UPDATE: తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.