ఇటీవల మృతి చెందిన తెదేపా నేతలకు సిడ్నీలోని ఆ పార్టీ సభ్యులు సమావేశమై నివాళులర్పించారు. కోడెల శివప్రసాద్, ఎన్.శివప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నిబద్ధత గల ఇద్దరు గొప్ప నాయకులను ఒకేసారి కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెదేపా ఆస్ట్రేలియా సంస్థ అధ్యక్షుడు పల్లపోతు శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ కార్యవర్గం, సభ్యులు, అభిమానులు పాల్గొని దివంగత నేతల మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు.
ఇదీ చదవండి: అశ్రునయనాల మధ్య శివప్రసాద్ అంత్యక్రియలు