స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా.. గిరిజనులు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నారని సీపీఐ నాయకుడు హరినాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పథకాలకు గిరిజనులు అర్హులు కారా అని ప్రశ్నించారు. ఓట్లు వేసేందుకు అవసరమొచ్చే గిరిజనులు.. ప్రభుత్వ పథకాల అమలుకు పనికిరారా అని మండిపడ్డారు.
తిరుపతి నగరానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజనులు.. నేటికీ ఎలాంటి వసతులు లేక దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలోనూ వారికి ఉచిత బియ్యం ఇవ్వకుండా కడుపులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డులు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: