ETV Bharat / state

విషాదం: ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

ప్రేమించానంటే నమ్మి పెళ్లికి ఒప్పుకుంది. పదేళ్లు కలిసి కాపురం చేసింది. ఆ తర్వాత భర్త దాష్టీకాన్ని తట్టుకోలేకపోయింది. తల్లితండ్రులను పోగొట్టుకున్న బాధతో కాలం వెళ్లదీస్తున్నా.. కనికరం లేకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అత్తమామలే వేధింపులకు దిగుతున్న వేళ... బతికి లాభం లేదనుకుంది. భర్తను మార్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై తిరిగి తనకే శాపమవుతున్న తరుణంలో.. తనువు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. తాను లేకపోతే పిల్లల్ని చూసుకునేదెవరు.? జూదరిగా మారిన భర్తను నమ్మి పిల్లల్ని వదల్లేక తనతో పాటే తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్లిపోయింది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక దాగున్న వేదన ఇది.

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
author img

By

Published : May 25, 2021, 4:21 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురం పరిధి అన్నాస్వామి గండిచెరువు క్వారీగుంతలో స్థానికులు ఉదయం మూడు మృతదేహాలను గమనించారు. నీటిపై తేలుతున్న ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సమీపంలో కనిపించిన ద్విచక్రవాహనం ఆధారంగా వివరాలు సేకరించారు.

మృతులను చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గుడ్యానం పల్లెకి చెందిన 32ఏళ్ల నీరజ, ఆమె కుమారుడు 8ఏళ్ల చందు, కుమార్తె రెండేళ్ల చైత్రగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తు కోసం మృతురాలి గ్రామానికి వెళ్లిన పోలీసులకు... పిల్లలతో సహా చనిపోవాలనే బలమైన నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలు కలచివేశాయి.

పెనుమూరు మండలం గొల్లఇండ్లు గ్రామానికి చెందిన నీరజను అదే మండలం గుడ్యానంపల్లెకి చెందిన కిషోర్ కుమార్ పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నీరజ ఇంట్లో పెళ్లి ఇష్టం లేకపోయినా.. కిషోర్ ప్రేమించానంటూ వెంట పడటంతో ఒప్పుకుంది. ఐదేళ్ల క్రితం నీరజ తండ్రి కృష్ణమూర్తి, ఆర్టీసీ కండక్టర్​గా పని చేస్తున్న తల్లి పార్వతి దురదృష్టవశాత్తు చిత్తూరు దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించారు. మానసికంగా కృంగిపోయిన నీరజకు అత్తింటి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి.

తల్లితండ్రుల ఆస్తి తెచ్చుకోవాలని మానసికంగా వేధింపులకు దిగుతుండటంతో... నీరజ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గతేడాది లాక్ డౌన్ పెట్టేవరకూ తిరుపతి స్విమ్స్​లో కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సుగా పనిచేసిన నీరజ... భర్త, తన ఇద్దరు పిల్లలు చందు, చైత్రలతో కలిసి ఉండేది. లాక్ డౌన్ కారణంగా సొంత గ్రామానికి వెళ్లిపోయిన నీరజకు అప్పటినుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త జూదం, మద్యానికి బానిస కావటం.. లీజ్​కు తీసుకున్న కోళ్లఫారాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో తరచుగా భార్యాభర్తలకు గొడవలు జరిగేవి.

ఇటీవల ఈ వేధింపులు మితిమీరటంతో.. వేరుగా కాపురం పెడదామని నీరజ భర్తను కోరింది. ఆగ్రహించిన అత్తింటివారు దూషించటం, ఆదివారం భర్త విపరీతంగా కొట్టడంతో పిల్లలను తీసుకుని నీరజ బయటకు వచ్చేసింది. ద్విచక్రవాహనంపై పెనుమూరు నుంచి బయలుదేరి రామచంద్రాపురం మండలం సి.రామాపురం క్వారీ గుంతకు చేరుకుంది. జీవితం మీద విరక్తితో తాను చనిపోతే... పిల్లలు ఒంటరైపోతారన్న క్షణికావేశంలో తొలుత ఆ ముక్కుపచ్చలారని పిల్లలను నీటిలోకి తోసేసి.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాలు పాడవటం చూసి బహుశా ఇంటి నుంచి బయటకి వచ్చిన ఆదివారం రాత్రే ముగ్గురూ చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను క్వారీ గుంత నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భర్త, అత్తింటివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండీ... ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.