నాగులచవితి సందర్భంగా తిరుమలలో ఈరోజు సాయంత్రం శ్రీవారికి పెదశేషవాహన సేవ నిర్వహించబోతున్నారు. ఉభయదేవేరులతో కలిసి మలయప్పస్వామిగా దర్శనం ఇవ్వనున్నారు. అలాగే.. నేడు కపిలేశ్వరాలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు చేయబోతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కాగా.. ఈ నెల 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల సీఎంలు తిరుపతిలో భేటీ కాబోతున్నారు. అందువల్ల ఈనెల 13, 14, 15 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ నెల 12, 13 14 తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబోమని కూడా వివరించారు. దాతలకు గదుల కేటాయింపును కూడా నిలిపివేశారు.
నిన్న తిరుమల శ్రీవారిని 34,824 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,650 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు సమకూరింది.
ఇదీ చూడండి: AMARAVATI PADAYATRA : అటు ఆంక్షల చట్రం.. ఇటు ఉక్కు సంకల్పం