ETV Bharat / state

వెదురు కుప్పంలో తగ్గని సంక్రాంతి జోష్ - చిత్తూరు జిల్లాలో పశువుల పండగ

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో పశువుల పండగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండగ ముగిసినా పల్లెల్లో మాత్రం ఆ జోష్ ఇంకా తగ్గలేదు. మండలంలోని పలు చోట్ల పశువుల పండగ నిర్వహించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

to continues cattle fair at vedhurukuppam
వెదురుకుప్పంలో కొనసాగుతున్న పశువుల పండగ
author img

By

Published : Jan 21, 2020, 2:15 PM IST

వెదురుకుప్పంలో కొనసాగుతున్న పశువుల పండగ

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో మాత్రం సంక్రాంతి జోష్ ఇంకా తగ్గలేదు. పండగ చివరి రెండు రోజుల్లో నిర్వహించే పశువుల పండగను ఇప్పటికి నిర్వహిస్తుండటమే అందుకు నిదర్శనం. సాధారణంగా సంక్రాంతి చివరి రెండు రోజులు పశువుల పండగను ఇక్కడి ప్రజలు వైభవంగా నిర్వహిస్తారు. పశువులను పండగ రోజున పూజించడం, అలంకరించిన అనంతరం జన సమూహంలో వాటిని వదిలి జల్లికట్టు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పండగ ముగిసినప్పటికి మండలంలో పలు చోట్ల పండగను నిర్వహించడానికి ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. కోలాహలంగా సాగిన ఈ పండగకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఇదీ చూడండి: సంక్రాంతి ముగిసినా... కొనసాగుతున్న పశువుల పండగ

Intro:సంక్రాంతి పండుగ ముగిసినా పల్లెల్లో జోష్ ఇంకా తగ్గలేదు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పశువుల పండుగను ఘనంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. సాధారణంగా సంక్రాంతి సమయాల్లో చివరి రెండు పండుగల్లో పశువుల పండుగను ఇక్కడి ప్రజలు వైభవంగా నిర్వహిస్తారు.

Body:పశువులను పండుగ రోజున పూజించడం, అలంకరించడం వంటి చర్య అనంతరం జన సమూహంలో వదిలి జల్లికట్టు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పండుగ ముగిసిన తర్వాత కూడా మండలంలో పలు చోట్ల పండుగను నిర్వహించడానికి ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు.

Conclusion:కోలాహలంగా సాగిన పండుగకు మండలం నలుమూలల నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు ఐదు వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. మహేంద్ర ,ఈటీవీ భారత్ ,జీడీ నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.