ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. నాలుగో విడత జరగనున్న పల్లెపోరు ఏర్పాట్లపై.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన విధులపై సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారిస్తూ.. ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు రెండు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: