నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీశ్ కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరగనున్న ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలను పక్కాగా పాటించేలా అధికారులకు.. రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ పారదర్శకంగా ఉంటుందని కమిషనర్ గిరీశ్ అన్నారు.
ఇదీ చదవండి: మరోసారి అవకాశమిచ్చినా అరకొర స్పందన