తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి సమావేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,309కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య భవన్లో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో 150 అంశాలపై చర్చించిన సభ్యులు పలు అంశాలకు ఆమోదం తెలిపారు. యాత్రికుల వసతి సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చిన పాలకమండలి, గరుడ వారధి నిర్మాణంలో ప్రాజెక్ట్ డిజైన్స్ పై.. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నుంచి స్పష్టత కోరింది.
తితిదే నూతన పంచాంగం
శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పంచాంగాన్ని విడుదల చేసింది. శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని పంచాంగాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి ఇతర బోర్డు సభ్యులతో కలసి ఆవిష్కరించారు. మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తితిదే కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో పంచాంగం అందుబాటులో ఉంచనున్నారు.
ఇవీ చూడండి...