తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగియనుండడంతో తిరుమలేశుని దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. వైకుంఠంలోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇంకా వైకుంఠం వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందినవారు 4 గంటలపాటు వేచి ఉన్నారు. నిన్న మొత్తం లక్ష పైచిలుకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల 7 లక్షలు.
ఇవీ చదవండి..