ఫిబ్రవరి 19న తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురష్కరించుకొని అమ్మవారికి వాహన సేవలు కన్నులపండువగా జరపనున్నారు. రథసప్తమినాడు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వాహనసేవలు నిర్వహించనున్నారు.
వాహన సేవల వివరాలు..
ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హంసవాహనం. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు అశ్వ వాహనం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 వరకు చిన్నశేష వాహనం. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గజ వాహనం సేవలు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి...