కరోనాకు వైద్యం చేస్తామంటూ ప్రజల్ని మోసం చేస్తున్న ముగ్గురు నకిలీ వైద్యులను తమిళనాడు అరక్కోణం పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని రాణి పేట్ జిల్లా అరక్కోణంలో అన్నామలై, అరుల్ దాస్, పండరీ నాథన్ అనే ముగ్గురు వ్యక్తులు ఏ అర్హత లేకున్నా కరోనాను నయం చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు జరిపి... ముగ్గురు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. మెడికల్ షాప్ లైసెన్స్‌తో క్లినిక్ పెట్టుకున్నందుకు అన్నామలైను, పదో తరగతి మాత్రమే చదివి వైద్యుడని చెప్పుకుంటున్న అరుల్ దాస్ ను, సిద్ధ వైద్యం నేర్చుకుని అల్లోపతి డాక్టర్‌గా చలామణి అవుతున్న పండరీ నాథన్ అనే ముగ్గురు నకిలీ వైద్యులను అరెస్ట్ చేసినట్లు అరక్కోణం పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పరారీలో ఉన్న ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు