దొంగనోట్లు చెలామణి చేసే ముఠాను చిత్తూరు జిల్లా కేవీబీపురం పోలీసులు పట్టుకున్నారు. కొత్తూరు గ్రామానికి చెందిన మేకల కాపరి వెంటకమునిరెడ్డికి.. నిందితులు కొంత నగదు ఇచ్చి రెండు మేకలను తీసుకెళ్లారు. వారు ఇచ్చిన నగదు దొంగనోట్లని గుర్తించిన వెంకటముని కేవిబిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు ఒక్కరోజులోనే పుత్తూరు చెన్నై హైవే, రామగిరి వద్ద ముగ్గురు నిందితులకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితులు తమిళనాడుకు చెందిన షేక్ ఆయుప్, ఆయన బార్య పర్కత్ బీ, ఆటో డ్రైవర్ అబ్దుల్ ఫరిప్ గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారి వద్ద నుంచి దొంగనోట్లను ముద్రించడానికి ఉపయోగించిన ప్రింటర్, దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: మమ్మల్ని వేధింపులకు గురిచేస్తే రాజకీయ హీనులుగా మిగిలిపోతారు: నారాయణస్వామి