ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వీఐపీలు

వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకన్న స్వామివారిని నేతలు దర్శించుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Thirumala Sri Venkateswara swami temple visitted(darshnam) by Minister Peddi Reddy Ramachandra Reddy and former Minister Amarnath Reddy
వెంకన్న స్వామి సేవలో నేతలు
author img

By

Published : Jun 14, 2020, 11:59 AM IST

తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులందరూ భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారని... త్వరలో కరోనా వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. తెదేపా నేతల అరెస్టుకు సంబంధించి స్వామివారే తగు న్యాయం చేస్తారని అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: సీఎం జగన్నాటకం ముందు ఆస్కార్​ అవార్డు దిగదుడుపే: నారా లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.