ఇవీ చూడండి...
తిరుపతి స్విమ్స్‌లో మరోసారి చోరీ.. మృతదేహంపై బంగారం మాయం - chory on tirupati Svims news update
కరోనా రోగుల మృతుల శరీరంపై ఉన్న ఆభరాణాలు తరచూ మాయమవటం కలకలం రేపుతోంది. మరోసారి తిరుపతి స్విమ్స్ లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మృతుడి చేతికి ఉన్న ఉంగరాలు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.
స్వీమ్స్ లో మరోసారి మృతదేహంపై బంగారం మాయం
తిరుపతి స్విమ్స్ లో కరోనా మృతుల శరీరంపై తరచూ ఆభరణాలు మాయమవటం వివాదాస్పదమవుతోంది. కరోనాతో పోరాడుతూ స్విమ్స్ లో చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా... అతడి చేతికి ఉన్న ఉంగరాలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. దీంతో మృతుని బంధువులు స్విమ్స్ భద్రత అధికారికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ స్విమ్స్ లో ఇదే తరహా ఫిర్యాదులు రావడంతో... భద్రతను పటిష్టం చేయాలంటూ రోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి...
పైలెట్ ప్రాజెక్టుగా గుడికో గోమాత.. 28 దేవాలయాల్లో ఆలయానికో గోవు దానం