చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని నరసింగాపురం రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో స్కార్పియో వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన తాటిముంజులు విక్రయించే వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో తాటిముంజులు కొనడానికి వచ్చిన వారు నిలిపిన మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వారిలో తీవ్రంగా గాయపడిన రజని(28)ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి