ETV Bharat / state

మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధర రికార్డ్‌...

చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ చరిత్రలో కిలో టమాటా ఎన్నడూ లేనంత అత్యధిక ధర పలికింది. మంగళవారం కిలో టమాటా రూ.100కు విక్రయించారు.

టమాటా
టమాటా
author img

By

Published : Nov 17, 2021, 7:37 AM IST

కిలో టమాటా ధర వింటే నోట మాట రాని పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక ధర పలికింది. వరుస వర్షాలతో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గడంతో మంగళవారం కిలో టమాటా రూ.100కు విక్రయించారు. 28 కిలోల కేట్‌ ధర గరిష్ఠంగా రూ.2,800 పలకడం విశేషం. తంబళ్లపల్లె, సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని రాయల్‌పాడు, శ్రీనివాసపురం క్రాస్‌, అడగళ్‌ ప్రాంతాల నుంచి రైతులు మంగళవారం మదనపల్లె మార్కెట్‌కు కేవలం 148 టన్నుల సరకును మాత్రమే తీసుకొచ్చారు. ఇందులో 20 టన్నులు కిలో రూ.100 పలికాయని మార్కెట్‌ యార్డు కార్యదర్శి అక్బర్‌బాషా తెలిపారు. 'ఏ' గ్రేడ్‌ సరకు కిలో రూ.60 నుంచి రూ.100, 'బి' గ్రేడ్‌ కిలో రూ.16 నుంచి రూ.58 వరకు పలికింది. ఇక్కడి నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తమిళనాడుకు ఎగుమతి చేస్తారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లోనూ మంగళవారం వ్యాపారులు కిలో టమాటాను రూ.100కు విక్రయించారు. రెండు రోజుల క్రితం రూ.50 నుంచి రూ.60కి అమ్మారు. సాధారణంగా ఈ మార్కెట్‌కు రోజు 2 వేల బాక్సుల టమాటా వచ్చేది. ఒక్కో పెట్టెలో 25 కిలోల సరకు ఉంటుంది. మంగళవారం 300 బాక్సులే రావడంతో డిమాండ్‌ దృష్ట్యా కిలో రూ.100 వరకు వెళ్లింది.

ఇదీ చదవండి: Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.