తమ ఇంటిని ఓ వ్యక్తి ఆక్రమించాడని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లికి చెందిన ఓ కుటుంబం ఆరోపించింది. తమ సొంత ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
12 సంవత్సరాల క్రితం మా పొలాన్ని అమ్మేసి పిల్లల చదువు కోసం బెంగళూరు వెళ్లపోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి సంబంధించి కరెంట్, ఇంటి పన్నులు, వాటర్ బిల్లులు క్రమం తప్పకుండా కడుతున్నాం. నెల క్రితం మా ఇంటికి వస్తే పొలం కొన్న వ్యక్తి అడ్డుకున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాం. దారికి అడ్డంగా కంచె ఏర్పాటు చేశారు. గేటుకు తాళం వేసి వాచ్ మెన్ ద్వారా దాడికి ప్రయత్నిస్తున్నారు. భూమి కొన్న వ్యక్తి ఇప్పటికీ పూర్తి నగదు చెల్లించలేదు. ఇంటిని కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి- సునీత, భాధితురాలు