ETV Bharat / state

'రీకౌంటింగ్ చేసేంతవరకు కదిలేది లేదు' - నగరి ఎంపీడీవో ఆఫీస్ ముందు ఆందోళన న్యూస్

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని తెరణి గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలుపు విషయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి ఆశకు వచ్చిన ఓట్లలో 112.. చెల్లనివిగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. 11 ఓట్ల తేడాతో ఆమె ప్రత్యర్థి నిర్మల విజయం సాధించినట్లు తెలిపారు. దీంతో ఆశ.. తమ కార్యకర్తలతో కలిసి నగరి ఎంపీడీవో ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు.

Tension in front of Chittoor District Nagari MPDVO Office
'రీకౌంటింగ్ చేసేంతవరకు ఇక్కడినుంచి కదలేదిలేదు'
author img

By

Published : Feb 10, 2021, 9:15 PM IST

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని తెరణి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓట్ల లెక్కింపులో తీవ్ర ఆసక్తి, ఉద్రిక్తత నెలకొన్నాయి. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆశకు పోలైన ఓట్లలో 112 ఓట్లు చెల్లనివని అధికారులు ప్రకటించారు. మరో అభ్యర్థి నిర్మల 11 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆశ.. తమ కార్యకర్తలతో కలిసి నగరి ఎంపీడీవో ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు.

ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ.. డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆశ భర్త తెలిపారు. రీకౌంటింగ్ చేసేంతవరకు ఇక్కడినుంచి కదలేదిలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష అభ్యర్థి నిర్మల విజయం సాధించినట్లు.. డిక్లేర్ చేయడం చాలా దారుణమని తేరణి గ్రామ ప్రజలు.. బ్యాలెట్ బాక్స్​లను తరలించే బస్సు ముందు ధర్నా చేపట్టారు. రీ కౌంటింగే చేసే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా... పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.