ETV Bharat / state

సరిహద్దుల్లో చలి తీవ్రతకు చిత్తూరు జిల్లా జవాను మృతి

చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్ప నాయుడు అనే జవాను జమ్ముకశ్మీర్​లో కన్నుమూశారు. చలి అధికం కావటంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన... విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. రెడ్డప్ప మృతితో అతని స్వగ్రామం గడ్డకిందపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

telugu-jawan-from-chittoor-district-killed-in-jammu-and-kashmir

author img

By

Published : Jan 3, 2021, 3:31 AM IST

telugu-jawan-from-chittoor-district-killed-in-jammu-and-kashmir
రెడ్డప్ప నాయుడు భార్య, పిల్లలు

చలికి తట్టుకోలేక జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాను కన్నుమూశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గడ్డకిందపల్లెకు చెందిన మంచు రెడ్డప్ప నాయుడు(38)... 14 సంవత్సరాలుగా సైనికుడిగా సేవలందిస్తున్నారు. శనివారం జమ్ముకశ్మీర్​లో విధులు నిర్వర్తిస్తుండగా చలి తీవ్రతతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సహచరులు గమనించి ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించటంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హెలికాఫ్టర్​లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని రెడ్డప్ప కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.

కొద్ది రోజుల క్రితమే రెడ్డప్పకు పదోన్నతి లభించిందని...అంతలోనే తాము చెడువార్త వినాల్సి వచ్చిందని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సైనికుడి భౌతికకాయం మంగళవారం గ్రామానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి

న్యూఇయర్‌ వేళ.. 140కోట్ల వాట్సాప్‌ కాల్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.