తితిదే వెబ్‌సైట్(ttd website)లో సాంకేతిక సమస్య(technical issue in ttd website) తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(srivari special entry tickets) బుకింగ్ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ నెలకు ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి 25 వరకు రోజుకు 8వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య(technical issue in ttd website) ఏర్పడిందని అధికారులు తెలిపారు.
గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల(srivari special entry tickets)పై తితిదే(ttd) ప్రకటన చేసే అవకాశముంది.
ఇదీ చదవండి.. ttd special entrance tickets: శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల