చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న నారాయణ అదేపాఠశాలలో చదువుతున్న విద్యార్ధిని పట్ల లైంగిక వేధింపులకు గురిచేశారని బాలిక తండ్రి పుంగనూరు పోలీస్టేషన్లలో పిర్యాదు చేశారు. పాఠశాలకు సెలవులు ఇచ్చినా... నారాయణ బాలికకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో విషయాన్ని బాలిక తండ్రికి చెప్పింది. పోలీసుల ప్రాథమిక విచారణలో చేసిన తప్పును ఒప్పుకున్న నారాయణ... బాలిక ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకొని తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. నారాయణపై పోక్స్ సహా పలు లైంగిక వేదింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పుంగనూరు రూరల్ సీఐ మధుసుధన్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కేసు - latest news of chittoor dst
చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలో ఓ కీచక ప్రధానోపాధ్యాయుడు బాలికలను వేధిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.