పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు నిబంధనల ప్రకారమే శాసనమండలిలో చుక్కెదురవుతుందని తెలియని వైకాపా శాసనసభ్యులు... మేధావులు ఎలా అవుతారంటూ తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వం శాసనసమండలి రద్దుకు నిర్ణయం తీసుకోవటం తగదన్నారు. శాసనసభలో, మండలిలోనూ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పాస్ అయ్యి ఉంటే... మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకునేవారా..? అని ప్రశ్నించారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మండలి ఛైర్మన్‌ను మంత్రులు బెదిరించారని గౌనివారి శ్రీనివాసులు ఆరోపించారు.
ఇదీ చూడండి:ప్రైవేటు ఆసుపత్రిలో ఎంపీడీవో మృతి.. బంధువుల ఆందోళన