TDP Protest : చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేతల తీరుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. నిరసనలో భాగంగా పార్టీ శ్రేణులు చేపట్టిన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల అడ్డగింతతో శాంతీయుతంగా నిరసన చేపట్టినివ్వాలని.. టీడీపీ శ్రేణులు పోలీసులను కోరినా నిరాకరించారు. దీంతో పోలీసులను దాటుకుని టీడీపీ శ్రేణులు.. పలమనేరులోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి తమ నిరసన తెలియజేశారు.
అసలేం జరిగిందంటే : చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేతలు సోమవారం టీడీపీ అధినాయకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. దీంతో అగ్రహించిన టీడీపీ నేతలు మంగళవారం టీడీపీ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు వైసీపీ అధినాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని.. నిరసన కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం టీడీపీ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని.. టీడీపీ శ్రేణులు పోలీసులను ప్రశ్నించారు. కనీసం శాంతియుతంగానైనా నిరసన చేపట్టనివ్వాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు.
పోలీసులు టీడీపీ శాంతియుత నిరసనకు నిరాకరించారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకుని పార్టీ కార్యాలయం నుంచి స్థానిక అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే.. విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను అణగతొక్కడానికే ఆయన కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జగన్ దళిత వ్యతిరేకి అని దుయ్యబట్టారు. దళితులు ఏది చేప్తే అది నమ్ముతారని.. అమాయాకులనే రితీలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని అన్నారు. గత ప్రభుత్వ ఎస్సీ సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. దళితులపై ముఖ్యమంత్రి ఆరాచకలకు పాల్పడుతున్నారని.. ఎంతోమందిని హత్య చేశారని విమర్శించారు.
ఇవీ చదవండి :