రుయా ఆస్పత్రి ఘటనపై విచారణ జరిపించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంతో మే 10న రుయాలో జరిగిన విషాద ఘటనలో మృతుల సంఖ్యను తక్కువగా చూపించారని తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఆ ఫిర్యాదు లేఖను తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ అందజేశారు. ప్రభుత్వం మృతుల గురించి అసలు నిజాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఈ మరణాలకు బాధ్యత తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండీ… కరోనా వేళ ఆదరువు లేని మహిళలకు అండగా..'నారీసేన'