విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేసి.. కార్మికులు కడుపు కొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెదేపా నేతలు నిరసన కార్యక్రమాన్ని చేప్టటారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. కర్మాగారాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం.. మెుద్దు నిద్రలో ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సీఐటీయూ నేతృత్వంలో...
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తక్షణమే ఆపి.. కడపలో కేంద్ర ప్రభుత్వ నిధులతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'.. నిరంతర స్ఫూర్తి రగిల్చే నినాదం