తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలంటే స్థానిక శాసనసభ్యుడు కరుణాకరరెడ్డిని గృహనిర్బంధం చేయాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. నేటి నుంచే ఆయన కదలికలపై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు.
తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా విధులు నిర్వహించిన కరుణాకరరెడ్డికి దేవుడు అంటే భయం లేకుండాపోయిందని పట్టాభి ఆక్షేపించారు. తెదేపా పోలింగ్ ఏజంట్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, పోలింగ్ కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటమి భయంతో కరుణాకరరెడ్డి పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుపతిలో కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు.
ఇదీచదవండి.
ఇదీ చదవండీ... 'నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు'