తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం విశాఖ ఉక్కుపై మాట్లాడే ధైర్యం జగన్‌కు లేదన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. నెల్లూరు జిల్లా పొదలకూరులో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన.. విభజన చట్టం సమస్యలు పరిష్కరించే బాధ్యత లేదా అని జగన్ను ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో ఏం చేశారని వైకాపాకు ఓటేయాలని నిలదీశారు. మద్యంలో జగన్ బ్రాండ్‌లు తీసుకువచ్చి అమ్ముతున్నారని.. ప్రజారోగ్యం పట్టించుకోకుండా కొత్త మద్యం బ్రాండ్‌లు తెచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం అంశంపై జగన్ నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు.
వైకాపా పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. తనకంటే పాలన బాగా చేస్తాడని భావించే జగన్‌కు ఓటేశారన్న చంద్రబాబు..రేపట్నుంచి ప్రతి విషయంలో పన్నులు వేస్తారని మండిపడ్డారు. ఇసుకను తాము ఉచితంగా ఇస్తే...ట్రాక్టర్ ఇసుకకు ప్రస్తుతం రూ.5 వేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి కార్మికులు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
'తితిదే ప్రధాన అర్చకులుగా రమణదీక్షితుల్ని మళ్లీ ఎలా నియమించారు'