చిత్తూరు జిల్లాలోని తరిగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. అసత్యవాదులకు ఈ ఆలయ పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుంది. వివిధ గ్రామాల పెద్దలు ఎవరైనా అసత్యం చెప్పారు అని అనిపిస్తే ఈ ఆలయానికి తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహుని దుర్వాస మహాముని ప్రతిష్ఠించారు. ఆలయంలో ఎవరైనా అసత్య ప్రమాణం చేస్తే వారి వంశం నిర్వీర్యం అవుతుందని మహాముని శపించారని పురాణ కథనం. ఇప్పటికీ ఆ ముని శాపం ఫలిస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయంలో అసత్య ప్రమాణం చేసిన చాలా మంది ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: