చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో టమటా రైతులు నష్టాలు చవిచూశారు. కె.వి పల్లి మండలం గాలివారిపల్లి రైతు నారాయణ నాయుడు... మూడున్నర ఎకరాల్లో టమటా సాగుచేశారు. పంట సాగు కోసం సుమారు ఆరు లక్షల వరకు ఖర్చు చేశారు. పంట చేతికి వచ్చినా కొనేవారు లేరు. కాయలన్నీ తోటలోనే మాగిపోయాయి. నియోజకవర్గంలోని రైతులందరిదీ ఇదే పరిస్థితి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
టమాటా రైతులపై కరోనా దెబ్బ - corona updates in chitoor dst
కరోనా లాక్ డౌన్ వల్ల టమటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షలు వెచ్చించి సాగు చేసిన టమటా అమ్ముడుపోక తోటల్లో ఉన్నాయని చిత్తూరు జిల్లా పీలేరు టమాటా రైతులు విలవిల్లాడుతున్నారు.
టమాట రైతులకు కరోనా దెబ్బ