కరోనా ఆంక్షలను పక్కన పెట్టి.. మద్యం కోసం మందుబాబులు బారులుతీరిన దృశ్యాలు చిత్తూరు జిల్లాలో కనిపించాయి. పాలసముద్రం మండలంలోని బలిజకండ్రిగ, గంగమాంబపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు మద్యం దుకాణాలకు తమిళనాడు నుంచి జనం పోటెత్తారు. మొదట గుంపులు గుంపులుగా మందు కోసం ఎగబడ్డారు. వరుస క్రమంలో రాకపోతే విక్రయాలు నిలిపివేస్తామని దుకాణ నిర్వాహకులు హెచ్చరించడంతో.. భౌతికదూరం, మాస్కులు లేకుండానే వరుసలో నిలుచున్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ ప్రకటనతో లిక్కర్ షాపుల ముందు బారులు
మే 10 నుంచి తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుండటంతో.. అక్కడి మందుబాబులు మద్యం కోసం రాష్ట్రానికి వరుస కడుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకుంటుండగా.. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. కొవిడ్ నిబంధనలను పక్కనపెట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: