చిత్తూరుజిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని శేషాచల అడవులలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేపట్టారు. తలకోన అటవీప్రాంతంలోని మర్రిమానుదడి వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు సుమారు 45మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను చూసి స్మగ్లర్లు దట్టమైన అడవిలోకి పారిపోయారు.
వారిని వెంబడించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన 6 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను, తమిళ స్మగ్లర్లను భాకరాపేట ప్రధాన కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎఫ్.ఆర్.ఓ పట్టాభి తెలిపారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: 'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'